16 April, 2026 | 3:15 AM

పాఠశాల తనిఖీలో కలెక్టర్..

19-06-2025 05:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ఉన్నత పాఠశాలను కస్తూర్బా గాంధీ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ పంట గదిలోకి వెళ్లి ఆహార పదార్థాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. క్లాస్ రూమ్ లోని పరిశీలించి విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు స్కూల్ డ్రెస్సులు సరఫరా చేశారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులు బాగా శ్రద్ధగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ సులోమికరణ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.