21 August, 2026 | 2:37 AM

యుఎల్‌సీ విభాగాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

21-08-2026 12:00 AM

మేడ్చల్, ఆగస్టు 20 (విజయక్రాంతి): 22A నిషేధిత భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని దరఖాస్తుల క్లియరెన్స్ కు రీటైనేబుల్ భూముల వివరాలను పరిశీలించి ప్రభుత్వ జీవోల ప్రకారం అప్లోడింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ యు ఎల్ సి విభాగాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూముల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అప్లోడ్ చేస్తూ యూ ఎల్ సి కి సంబంధించిన పెండింగ్ క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజావాణి హాల్లో వివిధ మండలాల నుండి వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, డి ఎల్లు ,కంప్యూటర్ ఆపరేటర్లు రాత్రి వేళల్లో కూడా పనులు పూర్తి చేయాలన్నారు. ULC ఆన్లైన్ డేటాను త్వరగా క్లియర్ చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేసేందుకు రాత్రి వేళల్లో సైతం పనులను వేగవంతంగా నిర్వహించాలన్నారు.