భీమేశ్వర ఆలయంలో త్వరలో పీవోఎస్ సేవలు
- నగదు రహిత చెల్లింపులకు శ్రీకారం
- భక్తుల సౌకర్యమే లక్ష్యం,- ఈవో ఎల్ రమాదేవి
వేములవాడ, ఆగస్ట్ 20, (విజయ క్రాంతి): భక్తులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవ లు అందించేందుకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పివోఎస్) మిషన్ సేవలు అందుబాటు లోకి రానున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పివోఎస్ మిషన్ల వినియోగంపై ఇండియన్ బ్యాంక్ అధికారులు గురువారం ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక డెమో నిర్వహించి, డిజిటల్ చెల్లింపుల ప్రక్రియపై అవగాహన కల్పించారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ వంటి నగదు రహిత చెల్లింపు విధానాల ద్వారా భక్తులు సేవలకు సంబంధించిన రుసుములను సులభంగా చెల్లించవచ్చు. ము ఖ్య బుకింగ్ కౌంటర్, లడ్డూ కౌంటర్, కోడె కౌంటర్, ప్రోటోకాల్ కార్యాలయం, డొనేషన్ కౌంటర్లలో పివోఎస్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీంతో నగదు తీసుకెళ్లాల్సిన అ వసరం లేకుండా భక్తులు వేగంగా, సులభంగా సేవలను పొందే అవకాశం కలుగుతుంది.ఈ సం దర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మాట్లాడుతూ భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని తెలిపారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవల రుసుములు చెల్లించేలా పివోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఆధునిక సేవలను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఇండియన్ బ్యాంక్ అధికారులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యం
వేములవాడ, ఆగస్ట్ 20, (విజయ క్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న ప్రైవేట్ షాపుల నిర్వాహకులతో ఆలయ కార్యనిర్వహణ అధికారి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఆలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన వస్తువులు, పరిశుభ్రమైన ఆహార పదార్థాలను మాత్రమే అందించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఆలయ పవిత్రత, ప్రతిష్ఠకు అనుగుణంగా సేవలు అందించాలని షాపు నిర్వాహకులకు ఈవో సూచించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రత, నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఈఓ నవీన్ కుమార్, ఏఈఓ జయకుమారి, దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) పెరిక శ్రీనివాస్, పర్యవేక్షకులు వెల్ది సంతోష్, నులిగొండ రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ అజయ్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






