calender_icon.png 7 September, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప‌రిశీల‌న‌ కలెక్టర్ రాహుల్ రాజ్

06-09-2025 11:35:02 PM

శివంపేట్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పు  పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సంబంధిత లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో మొత్తం ఎన్ని  ఉన్నాయని, అవి ఏ ఏ దశలో ఉన్నాయో   అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభం కానీ ఇండ్లు ఎన్ని ఉన్నాయని  అధికారులను అడగడం జరిగింది.  నిర్మాణంలో ఉన్న ఇండ్లకు గాను సంబంధిత పంచాయతీ సెక్రటరీలు ఆలస్యం చేయకుండా వెంట వెంటనే ఫోటో తీసి అప్లోడ్ చేస్తే లబ్ధిదారుల అకౌంట్ లలో వెంటనే డబ్బులు జమ అవుతాయ అన్నారు.