28-05-2025 02:30:52 PM
తూప్రాన్,(మనోహరాబాద్),(విజయక్రాంతి): మెదక్ జిల్లా ఉమ్మడి మండలాలైన మనోహరాబాద్, తూప్రాన్ లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) బుధవారం విస్తృతంగా పర్యటించారు. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వర్షానికి తడిసిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో నిలిచిపోయిన నూతన ఎమ్మార్వో భవనాన్ని, ఇందిరమ్మ మోడల్ భవనాన్ని పరిశీలించిన పిదప ఇందిరమ్మ గృహాన్ని ఐదు లక్షలతో నిర్మించిన విధానాన్ని వివరించారు. మున్సిపల్ కేంద్రంలోని కూరగాయల సమీకృత భవనాన్ని పరిశీలించారు. అనంతరం పాత ఎంపీడీవో కార్యాలయాన్ని కూరగాయల సమీకృత భవనంలోకి మార్చడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు నూతనంగా మంజూరైన కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలిస్తున్నా మని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.