calender_icon.png 28 January, 2026 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పాత్ర అభినందనీయం

28-01-2026 12:45:08 AM

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : ‘హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయం. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు... నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువుపట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను  హైడ్రా ఆచరణలో పెడుతోంది ’ అని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పని చేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా.. రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అని సీఎం ట్వీట్ చేశారు.