29-10-2025 10:58:11 AM
మఠంపల్లి: మొంథా తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న గాలి వానలకు(heavy rain) మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో బొమ్మకంటి ఆదెమ్మ నివసించే పూరి గుడిసె మంగళవారం రాత్రి కూలిపోయింది. నిలువ నీడ కోల్పోవడంతో ఆ వృద్ధురాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.