calender_icon.png 8 September, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి..

08-09-2025 05:08:27 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్  సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 154 వచ్చాయి.రెవెన్యూ శాఖకు సంబంధించి 49, డీఆర్డీఓకు 32, గృహ నిర్మాణ శాఖకు 14, జిల్లా విద్యాధికారి కార్యాలయం 13, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 11, ఉపాధి కల్పన శాఖకు 7, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి ఐదు, ఎస్డీసీ, డీసీఎస్ఓ కు మూడు చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, ఎస్పీ ఆఫీస్, ఈఓ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎస్సీ కార్పొరేషన్, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఏడీ మైన్స్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, జిల్లా వైద్యాధికారి, నీటి పారుదల శాఖ అధికారి, ఈఈ పీఆర్, డీఐఈఓ, ఎల్డీఎం, మార్కెటింగ్ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి.