calender_icon.png 17 September, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు బస్తా యూరియా ఇప్పించలేని ఎంపీలు ఎందుకు..?

17-09-2025 06:14:17 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కొరత  రోజురోజుకు తీవ్రతరం అవుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేల్పూర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజుల నుంచి బిఆర్ఎస్  అన్ని వేదికల మీద ప్రభుత్వాని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, శాపనార్థాలు పెడుతున్నా అయినా కళ్ళు కనిపిస్తలేదా ?  అన్నం లేకుండా, నిద్రాహారాలు లేక గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారని వాపోయారు.  చెప్పులు లైన్లో , పాస్ బుక్ లు లైన్ లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చింది. 

రైతాంగం ఇబ్బంది పాలవుతున్నప్పటికీ చీమ కుట్టినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండి పడ్డారు. నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారని, తండాల్లో నుంచి వచ్చి యూరియా తీసుకుపోవడానికి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వానికి కనబడడం లేదని  వాపోయారు. ఒక్కో మండలానికి వేయి బస్తాలు అవసరముంటే వంద సంచులు పంపిస్తే ఎవరికి ఇచ్చెదని మండిపడ్డారు.