calender_icon.png 10 September, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్

04-09-2025 12:00:00 AM

వరద ఇన్ ఫ్లోను పర్యవేక్షించాలని ఆదేశాలు

హాజీపూర్ (మంచిర్యాల), సెప్టెంబర్ 3 : మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట వద్ద గల శ్రీపాదం ఎల్లంపల్లి ప్రాజెక్టును బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. జిల్లాలో ఎడతెరిప లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టులోకి వచ్చే వరద నీటి ఇన్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్న ఎస్‌ఆర్‌ఎస్ పి, కడెం ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీటి చేరిక పెరుగుతుందని, ఈ నేపథ్యంలో జిల్లాలో కురిసిన వర్షాలతో వాగులు,

చెరువుల నుండి సైతం వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో ఇన్ ఫ్లో అధికంగా ఉంటుందని, ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటి అవుట్ ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కలెక్టర్ వెంట ప్రాజెక్టు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.