03-09-2025 11:19:17 PM
గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1కిలో 220 గ్రాములు డ్రై గంజాయి పట్టుకొని వారిని అదుపులోకి తీసుకోని అనంతరం అక్కడ ఉన్న ఇద్దరినీ విచారించగ వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో అమ్ముతాన్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామని గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. బుధవారం 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ... అభినవ్ వర్ధన్ కొత్తగూడానికి చెందిన వ్యక్తి ఇతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా కు పాల్పడుతున్నాడని, అభి అనే వ్యక్తి కూడ గతంలో రెండు మూడు సార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాదులో, తనకు తెలిసిన ఇతర ప్రాంతాలలో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలని, ఉద్దేశంతో గంజాయ్ అక్రమ రవాణా చేసేవాడని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో గోదావరిఖని చెందిన చెరుకు శ్రీనివాస్ 29 పెయింటింగ్ వర్క్, శివాజీ నగర్, గోదావరిఖని అని ఆయన అక్క కొత్తగూడెంలో ఉండగా అక్కడికి వెళ్లిన సమయంలో అబినవ్ తో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణాకి ఇద్దరు ఒకటి అయ్యారని, ఇద్దరికీ గంజాయి అలవాటు ఉండటం వల్ల ఇద్దరు కలిసి తాగేవారని, అభినవ్ గోదావరి అవతల సీలేరు నుండి గుర్తుతెలియని వ్యక్తులు వద్ద గంజాయి తీసుకుని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదావని ఉద్దేశ్యం తో శ్రీనివాస్ మొదటగా 250 గ్రాములు గంజాయి తీసుకువచ్చి ఒక వ్యక్తి తో అమ్మినాడు.
అదే క్రమంలో శ్రీనివాస్ కూడా అభితో గోదావరిఖనిలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి తీసుకొని వచ్చి గోదావరిఖనిలో అమ్మేవాడని, అభినవ్ గతంలో కూడా వచ్చి అప్పుడప్పుడు శ్రీనివాస్ కు గంజాయి సరఫరా చేశాడని, ఈ క్రమంలో శ్రీనివాస్ గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోని యువతకు గంజాయి అమ్మినట్లయితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఉద్దేశంతో శ్రీనివాస్ అభినవ్ కి ఫోన్ చేసి ఒక కిలో గంజాయి కావాలని కానీ కిలోకి రూ.15000 వేలకు మాట్లాడి రూ.5000 వేల డబ్బులు ఇచ్చారు.
మిగతావి గాంజాయ్ తీసుకు వచ్చాక ఇస్తానని చెప్పగా, అభినవ్ భద్రాచలం గోదావరి ఒడ్డు అటవీ ప్రాంతం నుండి ఒక కిలో గంజాయి పట్టుకుని రాగా సమాచారం మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారని, గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, అనూష, క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుల్స్ రమేష్ మధుకర్ మధుసూదన్ ను ఏసిపి అభినందించారు.