04-09-2025 12:00:00 AM
చేవెళ్ల మారుతీనగర్‌లో విషాదం
చేవెళ్ల, సెప్టెంబర్ 3 : కారు బో ల్తా పడి యువకుడు అక్కడికక్క డే మృతి చెందిన విషాద ఘటన చేవెళ్ల పోలీస్ స్టే షన్ లో చోటుచేసుకున్నది. ఎస్ ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని మారుతీనగర్ కాలనీకి చెందిన గుడిపల్లి నితీష్ రెడ్డి (24) మంగళవారం రాత్రి వినాయక అసోసియేషన్ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అర్ధరాత్రి 12.15 గంటల సమయం లో నితీష్ రెడ్డి తన కారులో పొలం వద్ద మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్లా డు.
అయితే తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం సుమారు 6.30 గంటలకు గ్రామస్తుడు కనకమామిడి మల్లారెడ్డి తన పొలం వెళ్తుండగా, పెద్దవాగు దగ్గర కారు బోల్తా పడి కనిపించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యు లు ఘటనా స్థలానికి చేరుకొని నితీష్ రెడ్డిని బయటకు తీసి చూడగా తలకు తీవ్ర గాయం తో అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. వర్షం కారణం గా మట్టి రోడ్డు జారి కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతోనే ప్రమా దం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నా మని పోలీసులు తెలిపారు.