calender_icon.png 26 July, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బాధితులకు కలెక్టర్ సహాయం

24-07-2025 12:00:00 AM

ఎల్లారెడ్డిపేట,కోనరావుపేట,జూలై 23 (విజయక్రాంతి); జిల్లాలోని ఇద్దరు క్యాన్సర్ బాధిత మహిళలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థిక సహాయం అందజేశారు.ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నిరంక స్వప్న(లత),కోనరావుపేట మండలం వట్టెంల పరిధిలోని అజ్మీరా తండాకు చెందిన అజ్మీరా కళ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. తమ వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని వారు బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు విన్నవించారు.

దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ మహిళలకు ఆర్థిక సహాయం అందజేశారు.వట్టిమల్ల పరిధిలోని అజ్మీరా తండాకు చెందిన అజ్మీరా కళకు రూ. లక్ష సహాయం,దుమాల గ్రామానికి చెందిన నిరంక స్వప్న(లత), రూ. 75 వేల ఆర్థిక సహాయం చెక్కులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు. తమ ఇబ్బందుల పై వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ఆయా మహిళల కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.