24-07-2025 12:00:00 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ
నల్గొండ క్రైమ్, జూలై 23 : సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా ను నల్లగొండ జిల్లా పోలీసు అరెస్ట్ చేశారు. వారి నుండి 25 లక్షలు విలువైన బంగారం తో పాటు బైకు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నిందితుల వివరాలనుజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గత సంవత్సర కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లోని రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమీషనరేట్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి పూట తాళము వేసి వున్న ఇండ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని మంగళవారం నల్లగొండ II టౌన్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ Y.సైదులు కు వచ్చిన సమాచారము మేరకు నేరస్థులు నల్లగొండ ఆర్టిసి బస్ స్టాండ్ ఎదురుగా వున్న సవేరా లాడ్జ్ లో రూము తీసుకుని అనుమానాస్పదంగా ఉండటముతో నల్గొండ-II టౌన్ పోలీసులు నేరస్తులను పట్టు బడి చేసి వారిని అరెస్టు చేశామన్నారు విలువైన బంగారు వస్తువులు ఇతర ఆభరణాలు ల్యాబ్ టాబ్, బైక్ వస్తువులను స్వాధీనము చేసుకున్నట్లు తెలిపారు
నిందితులు వీరే...
.ఉబ్బని యోగేశ్వర్ @ యోగ, వల్లూరి యువరాజు చంద్ర,, పాలెం రాజేష్, దస్తర్ బండి షఫీ తోపాటు గంజాయి కేసులో నల్గొండ జైల్లో ఉన్న తలారి మనోజ్, పరారీలో ఉన్న సాయికుమార్ శ్రీకాంత్ లు మూటగాయపడి చోరీ చేశారు. రాత్రి సమయంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనం చేసి హైద్రాబాద్ కు వెళ్ళేవారు మొత్తమo 23 దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
సమావేశంలో నల్గొండ డిఎస్పి K.శివరాం రెడ్డి నల్గొండ-II టౌన్ సర్కిల్ CI రాఘవ రావు నల్గొండ-II టౌన్ SI Y.సైదులు నల్లగొండ రూరల్ SI సైదా బాబు హెడ్ కానిస్టేబుల్ పాయిలి రాజు , కానిస్టేబుల్ లు లావూరి బాలకోటి , శంకర్, జానకిరామ్ యం.ఏ ఫరూక్ లు పాల్గొన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు