calender_icon.png 27 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్యలో గ్రీన్ ఇండియా మిషన్

26-07-2025 08:54:15 PM

మంచిర్యాల (విజయక్రాంతి): స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School) లక్ష్మీనగర్ బ్రాంచ్ విద్యార్థులు గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని, క్రమం తప్పకుండా మొక్కలకు నీరు పోసి రక్షించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో మొక్కలను పెంచి రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. 

ప్రతి నెలా ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం, విద్యార్థులలో సామాజిక సేవా భావాన్నిపెంపొందించడం కోసం అవెర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇవి మా పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఒక భాగమన్నారు. అనంతరం విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) అరవింద్ రెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు, డీన్ శ్యాంతో పాటు ఇంచార్జిలు అనగమాత, కృష్ణవేణి, పి.ఇ.టి. కిషన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.