calender_icon.png 27 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు నేరాల జోలికి వెళ్ళవద్దు

26-07-2025 08:54:30 PM

అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్

కోదాడ: విద్యార్థులు న్యాయ సేవల పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో  రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగం, ఫోక్సొ చట్టాలను విద్యార్థులకు వివరించారు. విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకట రెడ్డి నరసయ్య,సీనియర్ న్యాయవాది గట్ల నర్సింహారావు, టి.సీతారామరాజు, చలం, దొడ్డ శ్రీధర్, జానీపాషా, కె.శరత్ కుమార్, ఆవుల మల్లిఖార్జున్, ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్,  మండవ మధు, శివశంకర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.