calender_icon.png 27 July, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచైతన్యలో మాక్ ఎలక్షన్

26-07-2025 08:56:33 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించేందుకు కాలేజ్ రోడ్ శ్రీచైతన్య పాఠశాలలో శనివారం మాక్ ఎలక్షన్‌ను నిర్వహించారు. స్కూల్ కేబినెట్ ఎన్నికలలో నాలుగు గ్రూపుల (కింగ్స్, మొగల్స్, ప్రారాల్, పీజర్స్) మధ్య పోటీ జరిగింది.

అలాగే హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ గర్ల్, స్పోర్ట్స్ క్యాప్టన్, సిసిఎఎ క్యాప్టన్ లను విద్యార్థులే ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 800 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.