calender_icon.png 27 July, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కాకతీయ విద్యాసంస్థల చైర్మన్

26-07-2025 08:58:51 PM

పెన్ పహాడ్: కాకతీయుల విద్యా సంస్థల చైర్మన్, చీదేళ్ల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరెడ్డి సీతారాం రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసి, అనంతరం కాసరబాద సమీపంలోని బధిరుల పాఠశాల విద్యార్థులకు అన్నదానం చేసి తన ధాత్రుత్వాన్ని చాటుకున్నారు. పిల్లలకు స్వీట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, వెన్న సీతారాం రెడ్డి, దొంగరి యుగేందర్, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, దాసరి శ్రీను, జూలకంటి వెంకట్ రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆనంతుల శ్రీను, మస్తాన్, కీర్తి వెంకట్రావు తదితరులు ఉన్నారు.