26-07-2025 08:51:59 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలు, ప్రసూతి తల్లులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. రోటరీ ఇంటర్నేషనల్ సూచించిన “మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్” పోగ్రామ్ ను పురస్కరించుకొని రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, ప్రసూతి తల్లులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంనిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో మొత్తం 60 పోషకాహార కిట్లు పంపిణీ చేయబడ్డాయి. ప్రతి కిట్‌లో ప్రొటీన్ బాక్స్, ఒక బ్రెడ్ ప్యాకెట్, రెండు ఆపిల్స్ జ్యూట్ బ్యాగులో ప్యాక్ చేసి అందించబడ్డాయి.