26-07-2025 08:51:56 PM
సమస్యలు విన్నవించిన కాలనీల వాసులు..
పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkata Ramana Reddy) పర్యటించారు. పలు కాలనీలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 40 వార్డులోని అంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవనానికి శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. 22వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విడతలవారీగా అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.