31-10-2025 01:52:04 AM
 
							ములకలపల్లి, అక్టోబర్ 30, (విజయక్రాంతి):పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబ ర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభు త్వం వెంటనే చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం ము లకలపల్లి లో కళాశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వి ద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేద విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ బిల్లులపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఫీజులు చేల్లించలేని పరిస్థితిలో విద్యకు దూరం అయ్యే ప రిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో మండల నాయకులు నాగచైతన్య, అశ్విన్,అశోక్,మధు,సౌమ్యశ్రావ్య, కావ్య, స్వా తి, చందన,జాస్విక, నరేష్,దీపక్, తదితరులు పాల్గొన్నారు.