31-10-2025 01:53:51 AM
 
							టేకులపల్లి, అక్టోబర్ 30, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం టేకులపల్లి మండలంలోని తంగెళ్ళతండా గ్రామంలో పంటనష్టం జరిగిన వరి పొలాలను సందర్శించారు. ఈ సందర్బంగా రైతులకు పంట లోనిల్వ ఉన్న నీటిని బయటకు పంపి వేయాలని, దానిద్వార మళ్ళీ పనలు లేస్తాయని సూచించారు.
అలాగే రైతులు ఉపాధి హామీ లో వున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మునగ పంట, పామ్ ఆయిల్ పం టలను వేసుకోవాలని అలాగే పశువుల షెడ్ ఏర్పాటు చేసుకొని పశువులను వ్యాధుల బా రి నుంచి కాపాడుకోవాలి సూచించారు. మండలంలో కురిసిన వర్షానికి జరిగిన పం ట నష్టం అంచనా వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఏఓ బాబురావు, ఏడీఏ జి లా లూ చాంద్, మండల వ్యవసాయాధికారి అన్నపూర్ణ, ఏఈఓ రమేశ్, పాల్గొన్నారు.