calender_icon.png 31 October, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం

31-10-2025 11:06:12 AM

జడ్చర్ల సిఐ కమలాకర్

జడ్చర్ల : రోజువారి దినచర్య లో భాగంగా వ్యాయామం(Exercise) కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జడ్చర్ల సిఐ కమలాకర్(Jadcherla CI Kamalakar) అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా  శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలి నుంచి సిగ్నల్ గడ్డ మీదుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ వరకు 2కె రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుత తరుణంలో మనందరం అనేక మానసిక ఒత్తిళ్లు, పని భారం, ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరముందన్నారు. అనారోగ్యం బారిన పడి చింతించడం కంటే, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, సైకిలింగ్ వంటి వ్యాపకాలు అలవర్చుకుని నిశ్చింతంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, కౌన్సిలర్లు సుంకసారి రమేష్, ఉమా శంకర్ గౌడ్, క్లబ్ ఎం సి మెంబర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాద్మీ ధ్రువ, బిజెపి మహిళా నేత సాహితీ రెడ్డి, ఎస్సైలు మల్లేష్, ఖాదర్, జయప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మీనాజుద్దీన్, వంశీ చారి, గుండు వెంకటయ్య, బికేఆర్, కరాటే శ్రీను, ఇమ్ము, కింగ్ కాజా, రామ్ రెడ్డి, మోయిన్, శ్రీనివాస్, మహేష్, రాము, కృష్ణయ్య, స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.