calender_icon.png 31 October, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అక్రమ కట్టడాలు కూల్చివేత

31-10-2025 11:11:52 AM

ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇండ్ల కూల్చివేత

పెద్దపల్లి,(విజయక్రాంతి): మాకు రాజకీయ నాయకుల, అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ, అసైన్మెంట్ భూములలో గతంలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇప్పుడు మంథని మున్సిపల్ అధికారులు(Manthani Municipal Officer) చెక్ పెడుతున్నారు. అక్రమంగా మంథని పట్టణంలో గతంలో ఇష్టం వచ్చినట్టు ఇండ్లు నిర్మించుకున్న వారికి ఇప్పుడు చెక్ పడుతుంది.

మంథని మున్సిపల్ లో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం రంగంలోకి దిగిన మంథని మున్సిపల్  అధికారులు గంగపురి 4వ వార్డు మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య మంథని బొక్కల వాగు సమీపాన నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని జేసీబీ యంత్రాలతో కూల్చివేశారు. లింగయ్య  కుటుంబ సభ్యులు అడ్డుకోవటంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంథని పోలీస్ పహారా మధ్య, మున్సిపల్ సిబ్బంది  అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని కూల్చివేశారు. దీంతో మంథని పట్టణంలో గతంలో అక్రమంగా ఇండ్లు నిర్మించిన వారి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.