calender_icon.png 5 November, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం

04-11-2025 12:00:00 AM

- జిల్లాలో 1కోటి48 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తాం

- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

- మల్కపేట రిజర్వాయర్ లో ఉచిత చేపపిల్లల విడుదల

- హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

కోనరావుపేట, నవంబర్ - 3 (విజయక్రాంతి ):మత్స్య కార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మ త్స్యశాఖ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్ లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కా ర్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా, ప్ర భుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి మత్స్యకారులకు 100% సబ్సిడీతో ఉచిత చేప బిల్లులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నారని తెలిపారు. చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మత్స్యకారులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు పోవాలని పిలు పునిచ్చారు.

జిల్లాలోని 456 చెరువుల్లో రూ. కోటి 78 లక్షల విలువైన 1కోటి 48 లక్షల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాజె క్టులు, రిజర్వాయర్లు, చెరు వుల్లో నిర్వహించనున్నామని తెలిపారు. మల్కపేట రిజర్వాయ ర్లో మొత్తం 7 లక్షల 50 వేల చేపపిల్లలు పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. 80 నుంచి 100 ఎం ఎం సైజ్ ఉన్న 1,74, 674 చేప పిల్లలు పోశారు. మత్స్య కారులకు ఉ పాధి కల్పించేందుకు కేజ్ కల్చర్, ఇతర విధానాలు అమలు చేస్తామని వివరించారు.

ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, బ్రిడ్జిల ని ర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. మల్కపేట రిజర్వాయర్ పనులను పూర్తి చేసి ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలంలోని గ్రామాల పొలాలకు సాగు నీరు విడుదల చేశామని గుర్తు చేశారు. మల్కపేట రిజర్వాయర్ పైకి వెళ్లే సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

మత్స్య కార్మికులు ఆర్థిక అభ్యున్నతి

జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని అన్నారు. మల్కపేట జలాశయంలో 7 లక్షల 50 వేలకు పైగా చేప పిల్లల ను విడుదల చేయడానికి సన్నాహాలు చేయ డం జరిగిందని తెలిపారు. 100 శాతం సబ్సిడీతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల్లో వచ్చే 10 రోజుల్లోగా చేప పిల్లలను విడుదల చేస్తామని అన్నారు.

దీనికోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపా రు. మత్స్య కార్మికులు ఆర్థిక అభ్యున్నతి సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా నీటి పారుదల శాఖ అధి కారి కిశోర్ కుమార్, డీఏఓ అఫ్జల్ బేగం త హసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ద, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.