23-07-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, జులై 22 (విజయ క్రాంతి): రాజకీయాలకు అతీతంగా నగరంలోని అన్ని కాలనీలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ 57వ డివిజన్ అశోక కాలనీలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటించి కాలనీలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. మొదట కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం అశోక కాలనీలో నిర్మిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణాన్ని సందర్శించి, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, మండల సమ్మయ్య, తాళ్ల పెళ్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు బంక సతీష్ యాదవ్, బంక చంద్రశేఖర్ యాదవ్, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్ రెడ్డి, కోశాధికారి వింజయమూరి సుధాకర్ స్వామి, ఎం. తిరుపతి, ఎర్రబోయిన కనకరాజు, భక్తులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.