calender_icon.png 6 October, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోని జాతర వేలం పాటల తేదీలు ఖరారు

06-10-2025 04:57:18 PM

రేగొండ (విజయక్రాంతి): శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర వేలం పాటలు ఈనెల 9వ తేదీ గురువారం నిర్వహించనున్నట్లు జాతర ఈవో బిల్ల శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర ప్రతి యేట నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీంతో ఈ యేడు కూడా నవంబర్ మాసంలో జరిగే జాతరకు కొబ్బరికాయలు, లడ్డు పులిహోర అమ్ముకొనుటకు వచ్చే నెల నవంబర్ 3 నుండి 10 వరకు తేదీలు ఖరారు చేశారు. దీంతో ధరావత్తు సొమ్ములు రూ.ఒక లక్ష ఉండగా గతేడాది కొబ్బరికాయలకు రూ.1,47000లు, అలాగే లడ్డు పులిహోరకు రూ.20,3000 లు హెచ్చు పాటలు వచ్చాయని తెలిపారు. ఇట్టి వేలం పాటలను తిరుమలగిరి గ్రామపంచాయతీ వద్ద బహిరంగంగా నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.