calender_icon.png 8 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వ్యవసాయ కూలీల సమస్యలు

08-09-2025 05:33:36 PM

బెల్లంపల్లి అర్బన్: వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బికేయంయు) ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి 2 లక్షల 70 వేల కోట్లు కేటాయించి, సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించాలన్నారు. రోజుకు రూ.700 కూలి ఇవ్వాలన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపచేయాలనీ,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు జరిపి, వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ. 12000 ఇవ్వాలన్నారు. సామాజిక పెన్షన్లను 4 వేలకు, వికలాంగులకి పెన్షన్ రూ.6000కు పెంచాలన్నారు. అర్హత50 సంవత్సరాలు పైబడిన వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.6000 పెన్షన్ ఇవ్వాలన్నారు. మహిళలకు గృహ లక్ష్మీ పథకం కింద నెలకు రూ. 2500 ఇవ్వాలనీ, పేదలు సాగు చేసుకుంటున్నా భూములకి, ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు మహిళలకు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.6 లక్షలు  ఇవ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో  నాయకులు బాపు, జిల్లా కార్యదర్శి మాణిక్యం, బానేష్, రాజమౌళి, లక్ష్మీనారాయణ, నరసయ్య,రాజేష్, పాల్గొన్నారు.