calender_icon.png 8 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి మండల కేంద్రంలో లంబాడీ ఆత్మగౌరవ ర్యాలీ

08-09-2025 05:25:56 PM

- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తెగల మధ్య గొడవను తెర దించాలి: టేకులపల్లి లంబాడి జేఏసీ

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల కేంద్రంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. టేకులపల్లి మండల మహా ర్యాలీ భూక్య లాలు నాయక్, మూడ్ హుస్సేన్ నాయక్, ధరావత్ ప్రేమ్చంద్ నాయక్ అధ్యక్షతన జరిగిన ర్యాలీ సేవ ఘడ్ సేవాలాల్ మహారాజ్ గుడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు చేరుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

ర్యాలీని ఉద్దేశించి ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర జాక్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెండు గిరిజన తెగల మధ్య నేలకొన్న గొడవలను రాష్ట్ర ప్రభుత్వం తెరదించాలని,1976లో చేర్చబడ్డ ఎస్టి ఉప తెగలు (లంబాడి, ఎరుకల, యానది, ఆంద్)తెగల పేర్లను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కోరారు. రాజకీయ లబ్ది కోసమే లంబాడీ గోండు, కోయ తెగల మధ్య చిచ్చు పెడుతున్నరని వారి ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, గుగులోతు రాజేష్ నాయక్, భూక్యా రవి రాథోడ్, కిషన్ నాయక్, బానోత్ రామానాయక్, మాలోత్ సురేందర్ నాయక్, బోడా పుణ్య నాయక్, బుక్య పాపా నాయక్, బాదావత్ సురేష్ నాయక్, బుక్య సైదులు నాయక్, రమేష్ నాయక్, కిషోర్ సింగ్ నాయక్, వాంకుడోత్ హాతిరాం నాయక్, మంగీలాల్ నాయక్, గణేష్ మహారాజ్, కిషన్ నాయక్, మూడ్ అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.