calender_icon.png 8 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

08-09-2025 05:21:48 PM

STUTS జిల్లా అధ్యక్షులు ఎస్.భూమన్నయాదవ్ 

నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలు మరియు ఉపాధ్యాయుల పరిష్కారానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అన్నివేళలా కృషి చేస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయులకు సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పలు పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 317 జీ.వో.  బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న పెన్షనర్స్ బిల్లులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను  వెంటనే విడుదల చేయాలని, ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన ప్రాథమిక పాఠశాలలలో సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వము విద్యా వాలంటీర్లను నియమించాలని. తద్వారా గుణాత్మక విద్యాసాకారం అవుతుంది. ఎస్టియు చేస్తున్న కృషిని గుర్తించిన ఉపాధ్యాయుల నుండి సభ్యత్వ నమోదులో భాగంగా అపూర్వస్పందన లభిస్తుందని తెలియజేశారు.