calender_icon.png 8 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం

08-09-2025 05:18:52 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో సోమవారంభారతియ కిసాన్ సంగ్ సదాశివనగర్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో రైతు సమస్యలపై తీర్మానాలు చేశారు. యూరియా కొరత వెంటనే తీర్చాలని, సోయాబీన్ కొనుగోలు సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని, గతంలో ప్రభుత్వం చెప్పిన రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అందరికి కాలేదు కాబట్టి అందరికీ మాఫీ చేయాలని, అకాల వర్షాలకు నష్ట పోయిన పంట నష్టం సర్వే చేసి రైతులకు పంట నష్టం నమోదు చేసి తగిన పరిహార  ఇప్పియాలని తీర్మానాలు చేశారు.