calender_icon.png 20 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ సమస్యలు పట్టించుకోని కమిషనర్

20-09-2025 12:04:35 AM

16వ వార్డ్‌లో కలెక్టర్ పర్యటన, కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పట్టణ పరిధిలో  16 వ వార్డు వినాయక్ నగర్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగువాన్ పర్యటించారు. ఈ సందర్భంగా గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమై కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో కాలనీవాసులు ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో కలెక్టర్ ఆశీష్ సంగువాన్ ఆకస్మికంగా పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. అధికారులతో తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,  రెవెన్యూ సిబ్బంది, సానిటరీ ఇన్స్పెక్టర్, పర్వేజ్, కాలనీ వాసులు, కాలనీ సంఘం అధ్యక్షులు చింతల లింగం, కోశాధికారి సునీల్ కుమార్, శ్రీనివాస్, ఎంపీ ఓ తిరుపతి, రాజు, రంజిత్, కృష్ణ తదితరులు ఉన్నారు.