calender_icon.png 20 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌జెండర్లకు చీరల పంపిణీ

20-09-2025 12:02:45 AM

టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో శుక్రవారం కామారెడ్డిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ట్రాన్స్ జెండర్ లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20 మంది ప్రాన్స్ జెండర్లకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చీరలను అందించినట్లు తెలిపారు.

ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ముఖ్య పండుగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు తన సొంత డబ్బులతో చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తాజా మున్సిపల్ కౌన్సిలర్ లు పంపరి లత శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, మామిళ్ళ రమేష్, తాటి లావణ్య ప్రసాద్, రంగా రమేష్‌గౌడ్ పాల్గొన్నారు.