26-07-2025 10:30:11 PM
అలంపూర్: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండల పరిధిలో కంచుపాడు గ్రామానికి చెందిన వడ్ల విక్రమాచారి పుల్లూరు టోల్ ప్లాజా వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 23న రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు టోల్ ప్లాజా సమీపంలో ఉన్న మద్యం షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి అక్కడ నుంచి హర్ష హోటల్ లో కూల్ డ్రింక్ తీసుకుని అక్కడే మద్యం సేవించేందుకు యత్నించారు. గమనించిన హోటల్ యజమాని ఇక్కడ మద్యం తాగవద్దని ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురై హోటల్ యజమానితో గొడవపడి అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన జగదీష్, జయంత్ సోయల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.