calender_icon.png 11 November, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ ఫోన్ రిపేర్.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

11-08-2024 07:52:54 PM

జగిత్యాల: జిల్లాలోని ఓ వ్యక్తి రిపేర్ కిచ్చిన ఫోన్ ఇవ్వట్లేదని కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం ఆత్యహత్యయత్నానికి పాల్లడ్డాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఓ సెల్ ఫోన్ పాయింట్లో మూడు రోజుల క్రితం రమేష్ అనే వ్యక్తి తన ఫోన్ పని చేయకపోవడంతో రిపేర్ షాప్ లో ఇచ్చాడు. మూడు రోజులు గడిచిన ఫోన్ ఇవ్వకపోవడతో రమేష్ ఆగ్రహించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో ఆవేదనతో రమేష్ జగిత్యాల బస్టాండ్ లో తన చేయిని బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రమేష్ ఆసిఫాబాద్ జిల్లా ఇబ్రహీం మండల్ లో  మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రమేష్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.