11-08-2024 07:34:22 PM
జగిత్యాల: జగిత్యాల జిల్లా వాసి రాముకు రాజీవ్ గాంధీ-2024 లెజెండరీ అవార్డు అందుకున్నారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.సరోజనమ్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజీవ్ గాంధీ-2024 లెజెండరీ అవార్డు బిసి కమిషన్ చైర్మన్ వి.బి. కృష్ణ మోహన్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ సత్య వెంకట్, హీరో నరేంద్ర, హీరోయిన్, సింగర్ మోడల్ ఫైజా జాన్ చేతుల మీదుగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన నలువాల రాముకి అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ... తను చేసిన విద్య, వైద్య, సామాజిక సేవలను గుర్తించి ప్రముఖుల చేతుల మీదుగా లెజెండరి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ డాక్టర్ ఎస్ సరోజనమ్మ కి ఈ సంధర్భంగా రాము కృతజ్ఞతలు తెలిపారు.