31-07-2025 11:28:00 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మీసేవ ద్వారా ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రం పొందితే అందులో దరఖాస్తుదారు పుట్టిన తేదీ కూడా నమోదు చేసి కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఇకనుండి అలా కాకుండా కేవలం కుల ధ్రువీకరణ పత్రం కమ్యూనిటీ సర్టిఫికెట్ మాత్రమే మీ సేవ ద్వారా జారీ అవుతుందని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీసీఎల్ఏ కమిషనర్, ఈ.ఎస్.డి మీసేవ కమిషనర్లు ప్రజల ఉపయోగాల దృష్ట్యా, కొన్ని మార్పుల కారణంగా ప్రస్తుతం ఇకనుంచి కమ్యూనిటీ సర్టిఫికెట్ మాత్రమే జారీ చేయడం జరుగుతుందన్నారు. పుట్టిన తేదీకి సంబంధించిన వివరాలు రావడం లేదని గతంలో కులం సర్టిఫికెట్ తీసుకున్న దరఖాస్తుదారులు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు తమ వద్ద ఉన్న పాత మీసేవ కులము సర్టిఫికెట్ నెంబర్/ఆధార్ నెంబర్ చెప్తే అదే సర్టిఫికెట్ ను కొత్తగా తీసుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.