01-08-2025 07:43:08 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు నేనావత్ రవి కుమార్ ఇటీవలే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై చనిపోవడంతో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్(MLA Madan Mohan Rao) జన్మదిన సందర్భంగా వారి కుటుంబానికి శుక్రవారం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో రూ.10 వేలు రవికుమార్ కుటుంబానికి అందజేశారు. రవికుమార్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భార్య, పిల్లలకు మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు తమ వంతు సహాయంగా ఒక పదివేల రూపాయలను ఆర్థిక అందజేశామన్నారు. ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్, ఉపాధ్యక్షులు కిరణ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచం సిద్దు, ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు ప్రకాష్, ఎంవైఎఫ్ అధ్యక్షులు భాగేష్, హైమద్, మహిపాల్, కైలాష్, రాజేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.