01-08-2025 08:08:14 PM
వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి..
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆదేశాల మేరకు ముస్తాబాద్ ప్రభుత్వం పాఠశాలలలోని బాల భవిత హెల్త్ మెడికల్ క్యాంపులో మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఆదర్శ పాఠశాల నామాపూర్, కేజీబీవీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ముస్తాబాద్ లో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గీతాంజలి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సంరక్షణ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ జ్యోతి హెల్త్ సూపర్ వైజర్ ప్రసాద్,హెల్త్ సూపర్ వైజర్ ఏళ్ల గొండమ్మ ఎమ్ఎల్ ఎచ్ పి లు ఉదయ్,రజిత, రమ్య,ఏ ఎన్ ఎం లు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.