calender_icon.png 2 August, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

01-08-2025 07:38:23 PM

నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Government Polytechnic College)లో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐలయ్య(College Principal Ailaiah) ఓ ప్రకటనలో తెలిపారు. 

దరఖాస్తుల స్వీకరణ: 02-08-2025 నుండి 05-08-2025 వరకు

దరఖాస్తుల పరిశీలన ఇంటర్వ్యూలు: 06-08-2025

లెక్చరర్ ఇన్ సివిల్ - 4 పోస్టులు 

లెక్చరర్ ఇన్ CME - 2 పోస్టులు 

లెక్చరర్ ఇన్ EEE - 3 పోస్టులు 

లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ - 1 పోస్టు

లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ - 1 పోస్టు

లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ - 1 పోస్టు

బోధన అనుభవం ఉన్న అభ్యర్థుల‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కలిపి నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇవ్వాలని సూచించారు. అర్హత కలిగి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు సంప్రదించండి: ప్రిన్సిపాల్, నాగార్జునసాగర్, 7095678629