calender_icon.png 2 August, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మరిల్లు కాలనీలో వన మహోత్సవం

01-08-2025 08:10:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని బొమ్మరిల్లు కాలనీలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానికులు పలు రకాల మొక్కలను శుక్రవారం నాటారు. కాలనీ అధ్యక్షుడు పోచయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి రిదాన్ సాయి, భూషణ్, రవీందర్ రెడ్డి, సంపత్ కుమారులు తదితరులు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 150 మొక్కలు నాటారు. కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.