calender_icon.png 2 August, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయిలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

01-08-2025 08:00:20 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్(MLA Madan Mohan Rao) జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్మోహన్ నిండు నూరేళ్లు జీవించాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయినా నాటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకంటి వెంకట్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, సంజీవులు, రాజు, మెట్టు చంద్రం, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.