calender_icon.png 2 August, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

01-08-2025 07:48:12 PM

భూపాలపల్లి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు ఎన్.రమేష్..

చిట్యాల (విజయక్రాంతి): ఎమ్మార్పీకి మించి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని భూపాలపల్లి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు ఎన్.రమేష్(Assistant Director of Agriculture Ramesh) అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంతో పాటు, గోపాలపూర్, నైన్ పాక గ్రామాలలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. సొసైటీ సిబ్బంది, ప్రైవేటు డీలర్లు తప్పనిసరిగా స్టాకు బోర్డులను ప్రదర్శించాలన్నారు. రైతులు అడిగిన ఎరువులను మాత్రమే విక్రయించాలని, మరొకటి వారికి అంటగడితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ అధికారి సీఎచ్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తారణ అధికారి సుమంత్ తదితరులు పాల్గొన్నారు.