01-08-2025 12:00:00 AM
నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం
గర్భగుడిలో మద్యం సీసాలు ప్రత్యక్షం
ఆలయ పూజారి నిర్వాకం
మణుగూరు, జూలై 31 (విజయక్రాంతి): కాకతీయుల కాలంనాటి శివలింగాపురం లోని నీల కంఠేశ్వర స్వామి ఆలయంలో ఘో రమైన అపచారం జరిగింది. స్వామి వారి గర్భగుడిలో గురువారం మద్యంసీసాలు ప్ర త్యక్షం కావడంపై తీవ్ర దూమారం రేపుతోం ది.శివయ్యా .. ఇదేందయ్యా... అంటూ భక్తు లు ఈ ఘటనపై మండిపడుతున్నారు. అర్చకుడి ప్రవర్తన, ఆలయ పవిత్రతకు భంగం కలిగేలామారింది.
ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. బయట ఏలా ఉన్న సరే కానీ, కొంత మంది మాత్రం భక్తులు పరమ పవిత్రంగా భావించే పవిత్ర పుణ్య క్షేత్రాల్లో పాడు పనులు చేస్తూ అక్కడ క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తున్నారు. తా జాగా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఇ లాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నీలకం ఠేశ్వర స్వామి ఆలయం లో పనిచేస్తున్న ఓ అర్చకుడి తీరుపై కొందరు భక్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఫి ర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆలయ ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో గర్భగుడిలో హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కాలు దర్శనమి వ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో అర్చకుడి లీలలు వెలుగు లోకి వచ్చాయి.
వెంటనే అధికారులు జరిగిన ఘటనను ఉన్నత అధికారులకు నివేదించి, అర్చకుని మందలించి, విధుల నుండి తొలగించారు. మరొ కరికి అర్చకత్వ బాధ్యతలను అప్పగించారు. కాగా గత కొన్ని ఏళ్లగా ఆలయం లో పూజారిగా పని చేస్తున్న రామచంద్రరావు అనారో గ్య స మస్యలతో బాధపడుతూ గత కొంత కాలంగా మద్యం సేవిస్తూ స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారని భక్తు లు చెబుతున్నారు.
భక్తులు పరమపవిత్రంగా భావించే నీలకంఠేశ్వర ఆలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అర్చకుడి తీరుపై భక్తులు మండిపడుతున్నారు.ఈ సంఘటనపై భక్తులు తీవ్రవిమ ర్శలు చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడడం అర్చకునికి తగదని విమర్శి స్తున్నారు.