01-08-2025 07:51:02 PM
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ..
హుజూర్ నగర్: వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ, గీత కార్మికుల, వికలాంగుల హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(MRPS National President Manda Krishna Madiga) అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, వితంతులు, వికలాంగుల చేయూత పెన్షన్ దారుల శ్రేయస్సుకై 2007 నుండి ఎమ్మార్పీఎస్ ముందుండి పోరాడుతుందన్నారు. వికలాంగుల సమస్యల పట్ల ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలు గానీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు.
తాను పెన్షన్ తీసుకునే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వారి సాధక, బాధలు అర్థం చేసుకొని ఎమ్మార్పీఎస్ పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. ఈనెల 13న హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చింత సతీష్, వీహెచ్పీఎస్ జాతీయ కార్యదర్శి గడ్డం కాశీం, జిల్లా ఇన్చార్జి రుద్రపోగు సురేష్, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజు,బచ్చలకూరి ప్రసాద్,ఎంజెఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఒగ్గు విశాఖ, చింతిర్యాల నాగయ్య, మంద నాగరాజు, రవీంద్ర, మీసాల శరత్, మంద వెంకటేశ్వర్లు గుండెపంగు బాబు, ఇందిరాల పిచ్చయ్య లక్ష్మణరావు,రూప రాణి, వీరలక్ష్మి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.