calender_icon.png 1 May, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పరిశీలన

24-04-2025 12:33:52 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 23 : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ 7వ బ్లాకు పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న  అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కార్పొరేటర్ పుష్ప, స్టాండింగ్ కమిటీ మెంబర్ నగేశ్ పంచాయతీ రాజ్ డీఈ సురేశ్తో  కలిసి బుధవారం పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు.

మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ను ప్రారంభిస్తామని కార్పొరేటర్ తెలిపారు. కాంట్రాక్టర్ రాజేశ్, నర్సింగ్ రావు, కావలి నగేశ్, బాలయ్య, ముత్తన్న వీరయ్య తదితరులుపాల్గొన్నారు.