calender_icon.png 4 October, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూల్ అభివృద్ధే నా ధ్యేయం..

04-10-2025 12:41:04 AM

- దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

 నాగర్ కర్నూల్ అక్టోబర్ 3 ( విజయ క్రాంతి ) నాగర్ కర్నూల్ నియోజకవర్గం విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతానని స్థానిక ఎమ్మెల్యే కూచుకున్న రాజే ష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గురువా రం నాగర్ కర్నూల్ జిల్లా కేసరి సముద్రం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం తరలి రావడంతో కిలోమీటర్ మేర ట్యాంక్బండ్ ప్రాంగణమంతా ఒక్కసారిగా కిక్కిరిసింది

ఈ సందర్భంగా మొదటగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆం జనేయ స్వామి ఆలయంలో జమ్మి పూజ తరువాత ట్యాంక్ బండ్ జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

విద్యుత్ ఉప కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం, ప్రభుత్వ జూనియల్ కళాశాల నూతన భవనం నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. జనరల్ ఆస్పత్రి అభివృద్ధి చేయడంతో పాటు మెడికల్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. అనంతరం బతుకమ్మ ఘాటు వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ అందరిని అలరించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీం సభ్యులు గాలిపటం సుధాకర్, మరి కొంతమంది సినిమా యాక్టర్ల చే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మైమరిపించాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి బందోబస్తుఏర్పాటుచేశారు.