calender_icon.png 11 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాం తనిఖీ

10-01-2026 12:17:20 AM

నిర్మల్ జనవరి 9 (విజయ క్రాంతి) : కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని శుక్రవారం, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫ రాజ్, రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.