18-12-2025 06:34:58 PM
నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు సున్నపు సైదులు మృతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కొవ్వాకుల రాంబాబు, ఉపసర్పంచ్ నీలం సాయిలు, కల్లు గీత సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుడుగుంట్ల బుచ్చిరాములు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు గౌడ సంఘం మండల కోశాధికారి నీలం అంజయ్య, అనంతుల ప్రభాకర్, నీలం వెంకటేశ్వర్లు, చెవుగోని సాయిలు,అనంతల జానయ్య, కుక్కడపు రవి తదితరులు పాల్గొన్నారు.