18-12-2025 06:38:20 PM
మాజీ ఎంపీ సోయం బాపూరావు..
తలమడుగు (విజయక్రాంతి): గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూ రావు అన్నారు. గురువారం మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ లను తలమడుగు మండల నూతన సర్పంచ్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారు నూతన సర్పంచ్ లను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ లు లచ్చంపూర్ సర్పంచ్ సేద్మకి జంగు, కజ్జర్ల సర్పంచ్ నారాయణ రెడ్డి, పల్లి కె సర్పంచ్ లక్ష్మి అశోక్, పునాగూడ సర్పంచ్ హన్మంత్, కొసయి సర్పంచ్ సిడం శైలజ రవి, పల్లి బీ సర్పంచ్ సంజీవ్,కాపర దేవి సర్పంచ్ మెస్రం వినాయక్, సకినాపూర్ సర్పంచ్ నిఖిత నగేష్, లింగి సర్పంచ్ దేవరీ పోచన్న, ఉండం సర్పంచ్ మహేందర్, రత్నపూర్ సర్పంచ్ సులోచన నరేష్, పల్సి బీ సర్పంచ్ లక్ష్మణ్ తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, సుంకిడి మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు.